Warangal Airport: వరంగల్ మంమునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు వచ్చే 3 నుంచి 4 వారాల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Warangal Airport సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం
మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో సమావేశమై మంమునూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.
మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 253 ఎకరాల భూమిని అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో మరో ఎయిర్‌పోర్ట్
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్‌లో కూడా కొత్త విమానాశ్రయం నిర్మాణానికి సుమారు 1,500 ఎకరాల భూమి సేకరణ జరుగుతోంది. ఈ విమానాశ్రయాన్ని రక్షణ దళాలు కూడా వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 100 కొత్త ఎయిర్‌పోర్టులు
రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు.
Warangal Airport సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాత్రను ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన అన్నారు. అలాగే ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
