3 నుండి 4 రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్లు రద్దు చెయ్యనున్న అధికారులు.

గంగాధర తెలంగాణ పత్రిక మే 27 : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో సుమారు 20 ఎకరాల భూమి కలిగి ఉన్నది. దీనిపై 30 ఏళ్ల నుండి సీలింగ్ యాక్ట్ అమల్లో ఉన్నది. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు చేయకూడదని హైకోర్టు ఆర్డర్ ఉన్నది. కానీ, పదిహనెండ్ల కాలంలో సర్వే నంబర్ 175లో 3, 197 లో 29, 198లో 191 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో 2016 ఆగస్టు 23న సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్ కార్యాలయం నుంచి అప్పటి కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కు నోటీసులు అందాయి. అప్పటివరకు 2018 కరీంనగర్ రూలర్ పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ రిజిస్టర్ ఆఫీస్కు మార్చారు కానీ అప్పటికే 424 రిజిస్ట్రేషన్లు చేశారు 2018 తర్వాత నుంచి 2024 వరకు గంగాధర పరిధిలో 52 రిజిస్ట్రేషన్ చేశారు. అందులో ఒక్కటి మాత్రమే లోకాయుక్త ఆదేశాల మేరకు జరిగినట్టు తెలిసింది కాగా కొత్తపెళ్లి భూముల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ లపై లోక సత్త నాయకులు పోరాటం చేస్తూ వచ్చారు. ఆ మూడు సర్వే నంబర్లపై 1995లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాలని అప్పటి కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్ విచారణ జరిపి సర్వే నంబర్ లోని భూములు సీలింగ్ పరిధిలో ఉన్నట్టు హైకోర్టు నివేదిక అందించారు దాని ప్రకారం సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు జరపద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా అప్పటినుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది. కేస్ పెండింగ్లో ఉండగానే కొందరు సదరు భూముల్లో అక్రమంగా లావదేవులు జరిపారు. దీనిని గుర్తించి లోక్సత్తా ఉద్యమ సంస్థ 2015లో లోక్ యుక్తాలో ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ ప్రారంభించిన లోకాయుక్త సదర భూములపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని.ఇకముందు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపరవద్దని రెవెన్యూ శాఖకు ఆదేశాలు దారి చేసింది. దాంతో అప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు వివరాలను జిల్లా రెవెన్యూ శాఖ లోక యుక్తకు సమర్పించింది ఈ క్రమంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో తిరిగి విచారణ ప్రారంభించండి లావాదేవీలు జరపద్దు అని 2024 నవంబర్ 14 ఆర్డీవో రిజిస్ట్రేషన్ శాఖకు లేక రాశారు. అయినా రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ విషయాన్ని లోకయుక్తకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన లోక యుక్త తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ప్రమీల స్థపతి 175 197 198 సర్వే నంబర్లలో ఇప్పటివరకు జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని మే 12న కరీంనగర్ ఆర్డీవోకు, కొత్త పెళ్లి తహసిల్దార్ కి జిల్లా రిజిస్టర్ కి మరియు గంగాధర సబ్ రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డిఓ పరమేశ్వర మహేష్ డిస్టిక్ రిజిస్టర్ ప్రవీణ్ మరియు సంబంధిత అధికారులతో గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం జరుగుతుందని. 3 నుండి 4 రోజుల్లో 476 రిజిస్ట్రేషన్ లను పూర్తిగా రద్దు చేస్తామని ఆర్డీవో తెలిపినారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!