Advertisement

Women Safety Awareness: మహిళల రక్షణపై అవగాహన కల్పించిన పోలీసులు

తెలంగాణ పత్రిక(APR.09): Women Safety Awareness, వర్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం మహిళా రక్షణ అంశాలపై పోలీసులు అవగాహనా కల్పించారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ వంటి పలు అంశాలపై పోలీసులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది, మహిళల భద్రతకు ఎల్లవేళలా, అందుబాటులో ఉంటామని మహిళల భద్రత తమ ముఖ్య బాద్యత అని పోలీసులు తెలిపారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. పిల్లలను, మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట షీ టీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేసి తెలపాలని సూచించారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గజ్వెల్ షీటీమ్ బృందం ఏఎస్ఐ శ్రీరాములు, మహిళా కానిస్టేబుల్ లావణ్య, ప్రిన్సిపల్ వెంకటేశం గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Read more: Read Today’s Latest E-paper News in Telugu

Advertisement

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →