Telanganapatrika (August 04): Warrior Woakes , ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ తన పోరాట పటిమతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మ్యాచ్‌లో తన జట్టుకు అవసరమైన సమయంలో, చేతికి గాయం ఉన్నా, వోక్స్ ఒంటరిగా మైదానంలోకి దిగారు. కేవలం ఆటగాడిగా కాదు, వారియర్‌లా ఎంట్రీ ఇచ్చారు.

Warrior Woakes గాయం ఉన్నా వెనకడుగేయలేదు..
ఒక చేత్తో బ్యాట్ పట్టుకుని, మరో చేతి గాయం తాళుతూ, రన్నింగ్ Between wickets చేస్తూ అట్కిన్సన్‌కు మద్దతుగా నిలిచారు. వోక్స్ పోరాటం ఇంగ్లండ్‌ను గెలిపించకపోయినా, ఆయన ఆత్మవిశ్వాసం, నిబద్ధత ప్రేక్షకులందరినీ కదిలించింది. సోషల్ మీడియా మొత్తం “Respect Woakes” అనే కామెంట్లతో నిండిపోయింది.
క్రిస్ వోక్స్ మరోసారి నిరూపించాడు – క్రికెట్‌లో నిజమైన హీరోలు స్కోర్‌నే కాదు, శ్రమను చూపిస్తారు.
Read More: Read Today’s E-paper News in Telugu