
TELANGANA PATRIKA(JUN 3) , Virat Kohli , ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli 35 బంతుల్లో 43 పరుగులు – తక్కువ స్ట్రైక్ రేట్
కోహ్లి 35 బంతుల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేయడంతో, అతని స్ట్రైక్ రేట్ 123గా ఉండటం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్ మోమెంటం RCB దారిలోకి తిప్పే అవకాశంలో కోహ్లి జాగ్రత్తగా కాకుండా బలంగా ఆడాల్సిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ కామెంట్
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, “PBKS బౌలర్లు కోహ్లిపై షార్ట్ & స్లో బంతుల ప్రణాళికతో ఎదురయ్యారు. కానీ అతను ఆ ప్రెషర్‌ని బ్రేక్ చేయలేకపోయాడు” అన్నారు. ఐపీఎల్ ఫైనల్ లాంటి వేదికపై 35 బంతుల్లో 43 రన్స్ మాత్రం తగినదిగా కాదని పేర్కొన్నారు.
ఫ్యాన్స్ సోషల్ మీడియా స్పందన
“ఇది కోహ్లి నుంచి ఆశించిన ఇన్నింగ్స్ కాదు”, “ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కాదు ఇది” అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ “కోహ్లి చాలా నిరాశపరిచావ్” అంటూ సీరియస్‌గా స్పందిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.