
తెలంగాణ పత్రిక (APR.13) : viral child answer in exam 2025. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని ఆసక్తికరంగా, కానీ కాస్త భావోద్వేగానికి లోనయ్యేలా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే…
ఇటీవల నిర్వహించిన వార్షిక పరీక్షల్లో భాగంగా, ఆంగ్లంలో “What your mother likes and dislikes” అనే ప్రశ్న వచ్చింది. దీనికి విద్యార్థిని రాసిన సమాధానం –

ఈ సమాధానాన్ని చూసిన పేపర్ దిద్దిన ఉపాధ్యాయుడు కూడా షాక్ అయ్యారు. చిన్నారి ఈ సమాధానం ద్వారా సమాజంలో మారిపోతున్న మానవ సంబంధాల్ని ప్రతిబింబించింది. కుటుంబంలో పెద్దలను తక్కువగా చూడటం, వారిని గౌరవించకపోవడం లాంటి పరిస్థితులు ఈ సమాధానంలో స్పష్టంగా కనిపించాయి.
viral child answer in exam 2025 ఉపాధ్యాయుడి స్పందన:
ఈ విషయంపై మాట్లాడిన ఉపాధ్యాయుడు, ‘‘ఈ చిన్నారి సమాధానం నన్ను ఆలోచింపజేసింది. నేటి సమాజంలో వృద్ధులను ఎలా చూసుకుంటున్నాం అనే దానికి ఇది ఓ ప్రతిబింబం. ఈ సమాధానం మామూలుగా చూడదగినది కాదు’’ అని అన్నారు.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయా?
‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అనే పాత పాట సరిగ్గా ఈ పరిస్థితిని వ్యక్తపరుస్తోంది. ఈ చిన్నారి రాసిన మాటలు మనిషి మనిషికి దూరమవుతున్న దారుణ వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి.
తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది
చిన్నారులు ఏమి చూస్తే అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నుంచి ప్రేమ, గౌరవం, మానవీయత లాంటి విలువలను నేర్పించాలి. పెద్దలను గౌరవించడం ఒక మంచి గుణం అని తెలియజేయాలి. అప్పుడే మన భవిష్యత్తు పౌరులు మంచి మనుషులుగా ఎదుగుతారు.

