వేములవాడ: రాజన్నకు కొత్త గుడి మూడు దశలలో ఆలయ అభివృద్ధి విస్తరణ.

వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన ఏములాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధికి చర్యలు రానున్న వెయ్యి ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ విస్తరణ

శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం

Advertisement

Advertisement

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రిక సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

Advertisement

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అన్నారు. గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు.

అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేసామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →