Vemulawada BJP వేములవాడలో వంశీకృష్ణ ఆధ్వర్యంలో యువత భారీగా బీజేపీలో చేరిక

తెలంగాణ పత్రిక (APR.23) : Vemulawada bjp. వేములవాడ పట్టణం 17వ వార్డులోని జాతర గ్రౌండ్ వేదికగా, యువ నాయకుడు బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ మరియు పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ సమక్షంలో 100 మందికి పైగా యువతీ యువకులు మరియు మహిళలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

vemulawada bjp joining vamsikrishna team 2025

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బండి సంజయ్ గారి ఆశయాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తాను,” అని చెప్పారు.ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ, “రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలాన్ని పెంపొందించడానికి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం చాలా సంతోషకరం,” అన్నారు.

Advertisement

రాపెల్లి శ్రీధర్ పేర్కొన్నారు, “వేములవాడలో నా అధ్యక్షతన మొట్టమొదటి సారిగా ఇలా పెద్ద మొత్తంలో పార్టీ చేరికలు జరగడం చాలా శుభదాయకం. భవిష్యత్తులో ప్రతి వార్డులోనూ బీజేపీ బలోపేతానికి ప్రయత్నాలు కొనసాగిస్తాం,” అని తెలిపారు.

Advertisement
vemulawada bjp

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కృష్ణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంటి మహేష్, వార్డు ముఖ్యులు గుంటి కనకయ్య, కోల మారుతి, పట్టణ కార్యదర్శి జవాజి రాజశేఖర్, పట్టణ కమిటీ సభ్యులు మరియు 17వ వార్డులోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Read More: TG intermediate 2025: ఇంటర్లో ఫెయిల్ అయినా విద్యార్థిని ఆహ*త్య

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →