Telanganapatrika (July 17) : Umbrella Distribution Charity Telangana, లయన్స్ క్లబ్ సేవా తరుణి హమాలీలకు వర్షాకాలంలో గొడుగులు పంపిణీ చేసింది.

Umbrella Distribution Charity Telangana.
సేవా తరుణి ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ
తొర్రూరు, లయన్స్ క్లబ్ సేవా తరుణి ఆధ్వర్యంలో లయన్ తుమ్మూరు శ్రీదేవి రెడ్డి-వెంకట్ రెడ్డి ఆర్థిక సహకారంతో గురువారం పట్టణంలోని హమాలీలకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా తరుణి అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ, అవసరార్థులకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ సేవా తరుణి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
హమాలీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు నిరంతరం కృషి చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని, ఈ హమాలీలు వినియోగదారులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలంలో తడిచి ఇబ్బందులు పడకుండా, వారి పనులు నిలిచిపోకుండా ఉండేందుకు హమాలీలకు గొడుగులు పంపిణీ చేయడం జరుగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంజి ప్రసాద్ రెడ్డి, హమాలీలు మరియు ఇతర వ్యక్తులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఇండియా సేవా కార్యక్రమాలు : https://www.lionsclubs.org/te
↳ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుగులో సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ : https://www.telangana.gov.in
↳ ప్రభుత్వ పథకాలు, సేవలు, నూతన కార్యక్రమాల వివరాలు పొందొచ్చు.
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి – ముఖ్యమైన అన్ని వివరాలు అక్కడ పొందవచ్చు.