Uber Unexpected Charges India: Uber బుక్ చేస్తే ఒక ధర… ట్రిప్ ముగిసే సరికి మరో ధర! హైదరాబాద్‌లో ప్రయాణికులు ఇప్పుడు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

Uber Unexpected Charges India ఊహించని చార్జీలు… వినియోగదారుల ఆగ్రహం
Uber పై ఫిర్యాదులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రయాణికులు ముందుగా చూపించిన ధర, చివరికి వసూలు చేసిన ధర మధ్య పెద్ద తేడా ఉందని ఆరోపిస్తున్నారు.
ఒకే ట్రిప్… మూడు రేట్లు!
Hyderabadలో నల్లకుంటకు చెందిన రంగానాథ్ అనే ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నాడు. మొదట రూ.174 చూపించి, తగ్గింపు పేరుతో రూ.164గా చూపించిన Uber… చివరికి రూ.178 వసూలు చేసింది. “ఇది ఒకసారి కాదు… చాలాసార్లు జరిగింది” అని అతను వాపోయాడు.
విద్యార్థులకూ ఇదే సమస్య
విద్యార్థిని శ్రీలక్ష్మి కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. “బుకింగ్ సమయంలో ఒక ధర… గమ్యానికి చేరుకున్నాక మరో ధర… ఇది కస్టమర్లను మోసం చేయడమే” అని ఆమె అభిప్రాయం.
రూట్ మారితే ఛార్జీలు పెరుగుతాయా?
డ్రైవర్లు కూడా ఈ సమస్యపై స్పందిస్తున్నారు. ట్రాఫిక్ తప్పించేందుకు మార్గం మార్చినా… ఛార్జీలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఉదాహరణకు షార్ట్ రూట్ తీసుకున్నా… అదనంగా రూ.46 వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఇతర సమస్యలు కూడా , తప్పుగా క్యాన్సిలేషన్ ఫీజులు , క్యాష్ చెల్లింపుల ఒత్తిడి డెసిమల్ ఫేర్ (₹0.46, ₹0.60) రౌండింగ్ సమస్యలు ఈ కారణాల వల్ల ప్రయాణికులు అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తోంది.
Surge Pricing పై అనుమానాలు
Uber చెబుతున్నట్టు సర్జ్ ప్రైసింగ్ పారదర్శకంగా లేదని వినియోగదారులు అంటున్నారు. ఇది డిమాండ్-సప్లై కంటే… కస్టమర్లను మోసం చేసే విధంగా మారిందని విమర్శిస్తున్నారు.
Uberలో పెరుగుతున్న ఈ సమస్యలు… వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Read More: Read Today’s E-paper News in Telugu
