
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. TS SSC Results 2026 విడుదలకు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. సవరించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 29న ఫలితాలు వెలువడనున్నాయి.
ఏప్రిల్ 28, 2026 నాటి తాజా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాల విడుదల వివరాలు
ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ రికార్డు స్థాయిలో పూర్తి కావడంతో ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలను ఇస్తున్నారు.
| ముఖ్య అంశం | వివరాలు |
|---|---|
| రిజల్ట్స్ విడుదల తేదీ | ఏప్రిల్ 29, 2026 |
| విడుదల సమయం | ఉదయం 11:00 గంటలకు |
| రిజల్ట్స్ విడుదల చేసే వారు | కె. కేశవరావు (ప్రభుత్వ సలహాదారు) |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Q1. TS SSC Results 2026 EXAM DATE?
A: 10వ తరగతి పరీక్షలు 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగాయి.
Q2. TS SSC Results 2026 CONFIRMED DATE?
A: పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 29న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
మొదటగా bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీలో కనిపించే ‘TS SSC Results 2026’ లింక్‌పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
చివరగా TS SSC Results 2026 విడుదలైన వెంటనే వెబ్‌సైట్ పై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా results.cgg.gov.in ద్వారా కూడా మీ ఫలితాలను సరిచూసుకోవచ్చు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

One Comment on “TS SSC Results 2026: పదో తరగతి ఫలితాల రిలీజ్ డేట్ ఖరారు.. రేపు ఉదయం 11 గంటలకే!”
Comments are closed.