Telanganapatrika (July 13): Transformers , కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి గాజుల రామారం సర్కిల్ పరిధిలోని ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సర్కిల్ పరిధిలోని మహదేవపురం, బాలయ్యభస్తి లలో ఓ ప్రైవేటు స్కూల్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతి సరిగ్గా లేకపోవడంతో చుట్టూ చెత్తాచెదారం చెట్లు పెరిగి ప్రమాద అంచులో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపించి తమకు శాపంగా మారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Transformers ప్రాణాలతో ముడిపడ్డ విద్యుత్ సమస్య…
హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 901 ట్రాన్స్ ఫార్మర్లు ఉండగా ఇందులో సగానికి పైగా ప్రమాదకరంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని 55 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటికి విద్యుత్ సరఫరా కోసం లక్ష 30 వేలకు పైగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి.
9 సర్కిల్ లు 25 డివిజన్ లో పరిధిలో లక్ష 30 వేలకు పైగా డిటిఆర్ లలో సగానికి పైగా రక్షణ వలయం లేకపోవడంతో ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. బస్తీలు, కాలనీలు, స్కూల్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలలో ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు. నియోజకవర్గంలోని గృహాలకి, స్కూల్స్ కి సమీపంలో ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్లతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు.
ట్రాన్స్ ఫార్మర్ల కింద ఏర్పాటు చేసిన ఫ్యూజ్ బాక్స్ లకు మూతలు లేకపోవడమే కాకుండా అవి చిన్న పిల్లలకు అందే ఎత్తులో ఉండడం గమనార్హం. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చుట్టూ చెత్తాచెదారం ఉండటం చెట్లు పెరగడం రక్షణ వలయం లేకపోవడంతో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మూత్ర విసర్జన చేస్తూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి వాటిని మార్చాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా మర్చిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు పరుగులు పెట్టడం, అధికారుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుందని స్థానికుల ఆరోపణ. ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ కోసం నిధులు మంజూరు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం బాలయ్య నగర్ పలు బస్తీలలో ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని స్కూల్స్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ సరిగ్గా లేక ఎలాంటి ప్రమాదాలు వస్తాయోనని ప్రజల ఆవేదన. ఈ ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలోనే ప్రజలు, మూగజీవాలు ఎక్కువగా తిరగటం ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Transformers ఎలా పనిచేస్తాయి…
ట్రాన్స్ఫార్మర్ అనేది విద్యుత్ శక్తిని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్‌కు బదిలీ చేసే ఒక విద్యుత్ పరికరం. విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో వోల్టేజీని మార్చడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలలో వోల్టేజీని సర్దుబాటు చేయడానికి, పారిశ్రామిక పరికరాలలో వోల్టేజీని నియంత్రించడానికి ఉపయోగపడతాయి.
Transformers ఎందుకు ప్రమాదమైనవి…
మెకానికల్ ఫెయిల్యూర్ ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా ట్రాన్స్ ఫార్మర్లు మంటలను ఆర్పుతాయి. కాబట్టి వీటిని సరిగ్గా నిర్వహించకపోతే మంటలకు కారణం అవుతాయి. మెరుపు దాడులు ఇతర చెడు వాతావరణాలు కూడా ట్రాన్స్ ఫార్మర్లు కాల పరిమితిలో 2.4 శాతం అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయని అంచనా వేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
