
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. TGSRTC Conductor Jobs కింద రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో కండక్టర్ నియామకాలు జరగనున్నాయి.
గమనిక: ప్రస్తుతం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
ఎంపిక ఎలా ఉంటుంది?
ఈ నియామకాలలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా:
- SSC (10వ తరగతి) మార్కులు
- రిజర్వేషన్ నిబంధనలు
- మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యం అవుతోంది?
గతంలో SSCలో మార్కుల విధానం ఉండగా, కొంతకాలం GPA విధానం అమలులో ఉంది.
దీంతో:
- మార్కులు ఉన్న అభ్యర్థులు
- GPA ఉన్న అభ్యర్థులు
TGSRTC Conductor Jobs ఇద్దరినీ ఒకే విధంగా ఎలా మెరిట్‌లో పరిగణించాలనే అంశంపై TGSRTC అధికారులు SSC బోర్డును వివరణ కోరారు.
SSC బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ నియామకాల ప్రత్యేకత
- మొత్తం పోస్టులు: 1,500
- సంస్థ: TGSRTC
- పోస్టు: Conductor
- రాత పరీక్ష: లేదు
- ఎంపిక: SSC మార్కుల ఆధారంగా
- ఉద్యోగం: Permanent
ఎవరికి మంచి అవకాశం?
- 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు
- ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు
- RTCలో స్థిర ఉద్యోగం కోరుకునేవారు
FAQs
1. ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు?
మొత్తం 1,500 కండక్టర్ పోస్టులు.
2. రాత పరీక్ష ఉంటుందా?
లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం SSC మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
3. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
SSC బోర్డు నుంచి GPA-మార్కుల మార్పిడిపై స్పష్టత వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
4. ఉద్యోగాలు పర్మినెంటేనా?
అవును. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది
