
Telugu Horoscope Today మేషం (Aries)
Telugu Horoscope Today ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో చిన్న సాంకేతిక సమస్యలు వచ్చినా ఆదాయం బాగుంటుంది. ప్రయాణ యోగం ఉంది.
వృషభం (Taurus)
ఉద్యోగంలో కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది. పని సంబంధిత ప్రయాణం ఉండొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం (Gemini)
పెండింగ్ పనులు పూర్తిచేయడంలో బిజీగా ఉంటారు. ఆదాయం పెరగడం సంతోషాన్నిస్తుంది. స్నేహితులతో వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారానికి కూడా అనుకూలమైన రోజు.
సింహం (Leo)
తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
కన్య (Virgo)
సంతానం నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది. స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.
తుల (Libra)
ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఉద్యోగంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
వృశ్చికం (Scorpio)
కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులను ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా చూసుకోవాలి.
ధనుస్సు (Sagittarius)
ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉండొచ్చు. సీనియర్ల సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మకరం (Capricorn)
కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుంది. భావోద్వేగంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
కుంభం (Aquarius)
అనవసర ఖర్చులను తగ్గించండి. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ప్రేమ, దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. షాపింగ్‌లో అవసరానికి మించి ఖర్చు చేయొద్దు.
మీనం (Pisces)
ఓర్పుతో వ్యవహరించాల్సిన రోజు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య ఖర్చులు రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించండి.
Telugu Horoscope Today July 15
గమనిక: ఇవి జ్యోతిష్య ఆధారిత సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu
