Telangana Vision 2047: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తూ, Vision 2047 ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి జోన్లుగా విభజించడం కీలక నిర్ణయంగా నిలిచింది.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో రాష్ట్రాన్ని మూడు ప్రత్యేక జోన్లుగా రూపొందించాలని ఆదేశించారు.
Telangana Vision 2047 ఆ మూడు జోన్లు:
- CURE – Core Urban Region Economy
- PURE – Peri Urban Region Economy
- RARE – Rural Agriculture Region Economy
ఈ జోన్ల ద్వారా పట్టణ, పరిసర పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సమానంగా జరిగేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్
రాబోయే డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘Future City’లో గ్లోబల్ సమిట్ జరుగుతుంది. ఈ సమిట్‌లో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేయనున్నారు.
ఈ సమిట్ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం భారీ ఆకర్షణగా మారుతోంది.
Vision 2047 డాక్యుమెంట్‌లో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి:
సమాన అభివృద్ధి , మహిళా సాధికారిత , యువతకు అవకాశాలు , సస్టైనబుల్ డెవలప్‌మెంట్, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడం తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ, చైనా మరియు జపాన్‌లతో పోటీ చేసే అభివృద్ధి స్థాయికి చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.
అభివృద్ధిలో కీలక రంగాలు
- ఫార్మా & లైఫ్ సైన్సెస్
- ఏరోస్పేస్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
- క్వాంటమ్ టెక్నాలజీ
- స్టార్టప్స్ & MSMEs
- టూరిజం
- ఎగుమతులు
ఇప్పటికే ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, GCCలు, పారదర్శక పాలన వంటి బలాల మీదే కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడం Telangana Vision 2047లో కీలక లక్ష్యాలుగా ఉన్నాయి.
Blue & Green Hyderabad లక్ష్యం
ఈ ప్రణాళికలో భాగంగా:
2,959 చెరువుల పునరుద్ధరణ , పార్కులు & అటవి ప్రాంతాల పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలు.
Village 2.0 లక్ష్యం గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు, శుభ్రమైన రోడ్లు , సోలార్ స్ట్రీట్ లైట్లు , అందించడమే ప్రధాన లక్ష్యం.
రవాణా రంగంలో భారీ మార్పులు
- మణిహారం-లాగా కొత్త Regional Ring Road
- హై స్పీడ్ మొబిలిటీ కారిడార్లు
- రీజినల్ రింగ్ రైలు
- నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్లు
- 11 రేడియల్ రోడ్లు
వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొఠగూడెంలో కొత్త ఎయిర్‌పోర్టులు , హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్ట్ వరకు అద్భుత హైవే , ఈ హైవే రెండు రాష్ట్రాల అభివృద్ధికి గేమ్ చేంజర్ కానుందని సీఎం తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
