Theatres Shutdown : మే 1 నుంచి థియేటర్లు బంద్

Theatres Shutdown: తెలంగాణలో సినిమా ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సింగిల్-స్క్రీన్ థియేటర్ యజమానులు మే 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది?

తెలంగాణలో సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. అందులో 150 హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
ఇప్పటికే 250 మంది థియేటర్ యజమానులు మే 1 నుంచి కొత్త విధానం లేకుంటే సినిమాలు ప్రదర్శించబోమని హెచ్చరిస్తున్నారు.

Advertisement

రెంటల్ సిస్టమ్ వల్ల నష్టాలు

ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానం ప్రకారం థియేటర్ యజమానులు ముందుగానే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించాలి , సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే రేటు, కలెక్షన్లు తక్కువైతే నష్టం పూర్తిగా యజమానులదే ఈ విధానం వల్ల చిన్న థియేటర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.

Theatres Shutdown పర్సెంటేజ్ (Revenue Sharing) సిస్టమ్ డిమాండ్

థియేటర్ యజమానులు ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలా పర్సెంటేజ్ సిస్టమ్ కోరుతున్నారు:

Advertisement
  • 1వ వారం: 60% షేర్
  • 2వ వారం: 50%
  • 3వ వారం: 40%

ఇప్పటికే హైదరాబాద్‌లో 23 థియేటర్లలో ఈ విధానం అమల్లో ఉంది.

ప్రొడ్యూసర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

భారీ బడ్జెట్ సినిమాలకు రిస్క్ ఎక్కువ , కలెక్షన్లు తగ్గితే నష్టాలు పెరుగుతాయి , ఖర్చులు తిరిగి రావడం కష్టమవుతుంది , ప్రభుత్వం జోక్యం కోరుతున్న యజమానులు .

Advertisement

థియేటర్ యజమానులు ప్రభుత్వానికి కొన్ని ముఖ్య డిమాండ్లు పెట్టారు.

  • టికెట్ ధరల నియంత్రణ
  • విద్యుత్ ఛార్జీలలో సడలింపులు
  • పన్ను రాయితీలు
  • OTT రిలీజ్‌కు కనీసం 8 వారాల గ్యాప్
Theatres Shutdown ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?

ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం , ప్రేక్షకుల సంఖ్య తగ్గడం , నిర్వహణ ఖర్చులు పెరగడం (రోజుకు ₹12,000–₹18,000) , మల్టీప్లెక్స్‌ల పోటీ

మే 1 నాటికి ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణలో థియేటర్లు బంద్ అవ్వడం ఖాయం అనే పరిస్థితి కనిపిస్తోంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →