
Telangana SI Notification 2026 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 275 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), రిజర్వ్ SI, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనుంది.
Telangana SI Notification 2026 – పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 పోస్టులను భర్తీ చేయనున్నారు.
| పోస్టు | ఖాళీలు |
|---|---|
| SCT Sub Inspector (Civil) | 148 |
| Reserve SI (AR) | 14 |
| Reserve SI (SAR CPL-Men) | 3 |
| Reserve SI (TGSP-Men) | 12 |
| SI – Telangana Special Protection Force | 44 |
| Station Fire Officer | 39 |
| Deputy Jailor (Men) | 14 |
| Deputy Jailor (Women) | 1 |
| మొత్తం | 275 |
వేతనం
- SI పోస్టులు: ₹42,300 – ₹1,15,270
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ / డిప్యూటీ జైలర్: ₹38,890 – ₹1,12,510
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.

Telangana SI Notification 2026 ఎంపిక విధానం
ఈ Telangana SI Notification కింద అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమినరీ రాత పరీక్ష
- Physical Measurement Test (PMT)
- Physical Efficiency Test (PET)
- ఫైనల్ రాత పరీక్ష
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- మెడికల్ పరీక్ష
ప్రిలిమినరీ పరీక్ష
- అంకగణితం
- రీజనింగ్ & మెంటల్ ఎబిలిటీ
- జనరల్ స్టడీస్
మొత్తం 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ఫిజికల్ అర్హతలు
పురుషులు
- కనీస ఎత్తు: 167.6 సెం.మీ
- 1600 మీటర్ల పరుగు
- లాంగ్ జంప్
- షాట్‌పుట్
మహిళలు
- కనీస ఎత్తు: 152.5 సెం.మీ
- 800 మీటర్ల పరుగు
- లాంగ్ జంప్
- షాట్‌పుట్
గిరిజన అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎత్తులో సడలింపులు వర్తిస్తాయి.
వయోపరిమితి
- కనీస వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
Telangana SI Notification కోసం దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- Part-I అప్లికేషన్ పూర్తి చేయాలి.
- ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన తర్వాత మాత్రమే Part-II అప్లికేషన్ సమర్పించాలి.
- దరఖాస్తుల తేదీలను TSLPRB త్వరలో ప్రకటించనుంది.
ప్రభుత్వ పోలీస్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.
Official Website
Read More: Read Today’s E-paper News in Telugu
