Advertisement

Telangana Municipal Elections 2025 : తెలంగాణలో రెండో విడత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Telangana Municipal Elections 2025 : తెలంగాణలో రెండో విడత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Telangana Municipal Elections 2025 ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు

జనవరి 28న ఎన్నికల నోటీసు పట్టణ స్థానిక సంస్థల వార్డు వారీ ఓటర్ల జాబితా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా విడుదల చేయనున్నారు.

Advertisement

ఎన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు? ఈ విడతలో

  • 116 మున్సిపాలిటీలు
  • 7 మున్సిపల్ కార్పొరేషన్లకు

ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్ జరుగుతుంది.

నామినేషన్ల షెడ్యూల్

  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జనవరి 30 (సాయంత్రం 5 గంటల వరకు)
  • పరిశీలన (Scrutiny): జనవరి 31 ఉదయం 11 గంటల నుంచి
  • అభ్యంతరాలపై అప్పీలు దాఖలు: ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వరకు
  • అప్పీల్స్ పరిష్కారం: ఫిబ్రవరి 2 సాయంత్రం 5 గంటలలోపు
  • నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు
  • తుది అభ్యర్థుల జాబితా: ఫిబ్రవరి 3న విడుదల

ఫలితాల తేదీ

ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాల ప్రకటన జీహెచ్ఎంసీకి షెడ్యూల్ వర్తించదు ఈ ఎన్నికల షెడ్యూల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కు వర్తించదు. జీహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది.

జీహెచ్ఎంసీ విభజనపై చర్చ

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో జీహెచ్ఎంసీని

  • హైదరాబాద్
  • సైబరాబాద్
  • మల్కాజ్‌గిరి

మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్‌లో 150 వార్డులు, మిగతా రెండు కార్పొరేషన్లలో 75 వార్డులు చొప్పున ఉండవచ్చని తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →