Telangana School Holiday September 25 2026: తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 25, 2026న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ఊరేగింపు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏ ప్రాంతాల్లో సెలవు?
ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు వర్తిస్తుంది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ సంఖ్యలో భక్తులు, విగ్రహాల ఊరేగింపులు ఉండనున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ, రహదారులపై ఆంక్షలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది.
నవంబర్ 14 వర్కింగ్ డే
సెప్టెంబర్ 25న ఇచ్చిన సెలవుకు బదులుగా నవంబర్ 14, రెండో శనివారం పని దినంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు నవంబర్ 14న పనిచేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 25నే గణేష్ నిమజ్జనం
ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రధాన గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
నిమజ్జన ఊరేగింపుల కోసం పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఇతర పౌర సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రోడ్లపై బారికేడ్లు, నిమజ్జన పాయింట్లు, క్రేన్లు, స్విమ్మర్లు, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ రద్దీ
సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. దీంతో ప్రధాన ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక MMTS రైళ్లను నడపనుంది. సెప్టెంబర్ 25-26, 26-27 తేదీల్లో రాత్రి వేళల్లో అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు గమనించాల్సిన విషయం
సెప్టెంబర్ 25న సెలవు హైదరాబాద్-సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిధిలోని సంబంధిత విద్యాసంస్థలకు వర్తిస్తుంది. ఇతర జిల్లాల్లోని విద్యార్థులు తమ పాఠశాల లేదా కాలేజీ నుంచి వచ్చిన స్థానిక సమాచారం ఆధారంగా సెలవు ఉందో లేదో తెలుసుకోవాలి.
ముఖ్యంగా: సెప్టెంబర్ 25 సెలవుకు బదులుగా నవంబర్ 14ను వర్కింగ్ డేగా ప్రకటించిన విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.
Read More: Read Today’s E-paper News in Telugu

