Advertisement

Telangana movie ticket price hike controversy : టికెట్ ధరల పెంపుపై మంత్రి చేతులెత్తేశారా..

Telangana movie ticket price hike controversy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార కేంద్రాలు ఎక్కడున్నాయి? నిజంగా పాలన ఎవరి చేతిలో ఉంది? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. సినిమా టికెట్ ధరల పెంపుపై జారీైన ప్రభుత్వ ఉత్తర్వులు తనకు తెలియకుండా జరిగాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

శనివారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి, తన శాఖ నుంచి జారీ అయిన జీఓలకు తాను అనుమతి ఇవ్వలేదని, ఏ ఫైలూ తన దగ్గరకు రాలేదని స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం పరిపాలనా లోపం కాకుండా, మంత్రివర్గ బాధ్యత, అధికార శ్రేణి పూర్తిగా దెబ్బతిన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

‘పుష్ప 2’ ఘటన తర్వాత స్పష్టమైన ఆదేశాలు

‘పుష్ప 2’ సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత,

ప్రత్యేక షోలు ఉండవు

టికెట్ ధరల పెంపు ఉండదు

అని తాను అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించినట్లు కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఆ ప్రకటన తర్వాత ఎవరూ తనను సంప్రదించలేదని, దరఖాస్తులు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.

అర్ధరాత్రి జీఓలు – ఎవరి ఆదేశాలు?

ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం

అర్ధరాత్రి జీఓ కోర్టు స్టే రాకుండా టైమింగ్ ప్రీమియర్ షోకు రూ.600 టికెట్ సింగిల్ స్క్రీన్‌కు ₹50, మల్టీప్లెక్స్‌కు ₹100 పెంపు వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. ఈ పెంపు జనవరి 12 నుంచి 18 వరకూ అమల్లో ఉండనుంది.

షాడో పవర్ సెంటర్లపై ఆరోపణలు

ఈ జీఓల వెనుక ముఖ్యమంత్రి సమీపంలోని ఓ కాంగ్రెస్ నేత ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన కోమటిరెడ్డిపై స్లీజ్ కథనాలు, వ్యక్తిగత ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

“నేను ఒక్క ఫైలుకూడా సైన్ చేయలేదు”

మంత్రి స్పష్టంగా చెబుతూ,

“టికెట్ ధరల పెంపుకు సంబంధించి నేను ఒక్క ఫైలుకూడా సైన్ చేయలేదు. ఎవరు ఈ జీఓలు జారీ చేశారో నాకు తెలియదు” అన్నారు.

సినిమా పరిశ్రమపై ఆసక్తి లేదన్న మంత్రి

టికెట్ ధరలు, ప్రీమియర్ షోలు తన ప్రాధాన్యత కాదని,

  • సినిమా కార్మికుల ఇళ్ల సమస్యలు
  • కళాకారుల సంక్షేమం

వంటి అంశాలపైనే తాను దృష్టి పెడతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Telangana movie ticket price hike controversy రాజకీయ సంకేతం

మంత్రి చెప్పిన మాటలు చూస్తే, ప్రభుత్వంలో అధికారిక మంత్రులకంటే కనిపించని శక్తులే నిర్ణయాలు తీసుకుంటున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ ఇబ్బందిగా మారే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →