Telangana Liquor Shops: తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్ షాపుల లైసెన్స్‌ల కేటాయింపు కోసం లాటరీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కొత్త లైసెన్స్‌లు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు అమల్లో ఉండనున్నాయి.

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులు కేటాయించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు జరగనుంది. ప్రతి షాపుకు దరఖాస్తు ఫీజు ₹3 లక్షలుగా నిర్ణయించబడింది. గత లైసెన్స్‌లతో పోలిస్తే ఇది పెరిగిన మొత్తమని అధికారులు తెలిపారు.
లాటరీ ప్రక్రియ అక్టోబర్ 23న నిర్వహించబడుతుంది. లాటరీలో ఎంపికైన వారికి లైసెన్స్‌లు మంజూరు చేసి, షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
Telangana Liquor Shops ప్రభుత్వం అంచనా
ఈ లైసెన్స్‌ల కేటాయింపు ద్వారా రాష్ట్రానికి దాదాపు ₹6,500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
