Telangana Liquor Price Hike : తెలంగాణ మందుబాబులకు అలర్ట్… 20% వరకు ధరల పెంపు

Telangana Liquor Price Hike: తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలోనే భారీ ధరల షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

సమాచారం ప్రకారం మద్యం ధరలు కనీసం 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ తన నివేదికను సమర్పించగా, తుది నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Telangana Liquor Price Hike ఏ బ్రాండ్లపై ఎంత పెంపు?

  • సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు పెరుగుదల
  • ప్రీమియం విస్కీ, బ్రాండీ, వోడ్కా బ్రాండ్లపై రూ.100 వరకు పెంపు
  • హైఎండ్ బ్రాండ్లపై రూ.120కు పైగా ధరల పెంపు అవకాశం

అయితే అన్ని బ్రాండ్లపై ఒకే విధంగా ధరలు పెంచకుండా, వినియోగదారులపై భారం తగ్గించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ధరల పెంపుకు కారణాలేంటి?

పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా LPG కొరత ఏర్పడిందని, దీంతో గాజు బాటిళ్ల తయారీ ఖర్చులు పెరిగాయని డిస్టిలరీలు చెబుతున్నాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా వ్యయాలు కూడా అధికమయ్యాయి.

Advertisement
Advertisement

ఈ నేపథ్యంలో మద్యం తయారీ సంస్థలు 30 శాతం వరకు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

Telangana Liquor Price Hike ప్రభుత్వ ఆలోచన ఇదే!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, తయారీ సంస్థల ఒత్తిడి, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ధరల పెంపుపై ఆలోచిస్తోంది. అయితే సామాన్య వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడకుండా చౌక మద్యం ధరలను పరిమిత స్థాయిలో మాత్రమే పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →