Telangana Heatwave 2026: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లా కొరుట్లలో అత్యధికంగా 45.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రాష్ట్రంలోనే అత్యంత వేడిగా నమోదైన ప్రాంతంగా కొరుట్ల నిలిచింది.
Telangana Heatwave 2026 45°C దాటిన జిల్లాలు
- జగిత్యాల – 45.9°C
- నల్గొండ – 45.8°C
- నిర్మల్ – 45.8°C
- సిద్ధిపేట – 45.8°C
- మంచిర్యాల – 45.7°C
- పెద్దపల్లి – 45.7°C
- ఆదిలాబాద్ – 45.6°C
- కామారెడ్డి – 45.6°C
- కరీంనగర్ – 45.6°C
- నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం జిల్లాల్లో కూడా తీవ్ర ఎండలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ ఉక్కపోత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఎండలు తీవ్రంగా నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్‌లో 42.8°C, చందానగర్‌లో 42.6°C నమోదయ్యాయి. ఎల్‌బీనగర్, సంతోష్‌నగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో సుమారు 42.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలకు IMD హెచ్చరికలు
భారత వాతావరణ శాఖ ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది:
- మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దు
- తరచుగా నీరు తాగాలి
- పలుచటి, లైట్ కలర్ కాటన్ దుస్తులు ధరించాలి
- ORS, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలి
- పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
- రైతులు, పశువుల యజమానులకు సూచనలు
పంటలకు తరచుగా నీరు పెట్టాలని, పశువులను మధ్యాహ్న సమయంలో మేపడానికి తీసుకెళ్లవద్దని అధికారులు సూచించారు. పశువులకు తగిన నీరు, నీడ కల్పించాలని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu

