Advertisement

Telangana Formation Day 2025 : జిల్లాలో Collector హనుమంత రావు పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశాలు..

TELANGANA PATRIKA(28) , Telangana Formation Day 2025 :యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Telangana Formation Day 2025 కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష సమావేశం:

బుధవారం రోజు కలెక్టర్ ఛాంబర్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగే కార్యక్రమాలపై విభాగాల వారీగా సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు అట్టహాసంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Advertisement

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సమాచారం అందించాలి
వివిధ వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, వ్యవసాయం, వైద్యారోగ్యం వంటి పథకాల వివరాలు ప్రజలకు తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మినారాయణ, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ జగన్మోహన్ ప్రసాద్, తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →