
TELANGANA PATRIKA(JUN 2) , తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడింది. నేటితో 11 ఏళ్ల ప్రయాణం పూర్తిచేసుకొని, 12వ ఏడులోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం పాలిటికల్ నిర్ణయం కాదు, కోటి మందిని ఏకం చేసిన ప్రజా ఉద్యమ ఫలితమే.
తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నేపథ్యం:
“నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదం చుట్టూ తెలంగాణ ఉద్యమం భగ్నాలపై ఆశలు నాటింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు అన్నివర్గాల వారు చురుగ్గా పాల్గొన్నారు.
- మిలియన్ మార్చ్
- సకల జనుల బంద్
- ఉద్యోగుల సమ్మెలు
ఈ మూడు కీలక దశలు ఉద్యమానికి జవసత్వం ఇచ్చాయి. ఆ ఉద్యమంలో ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం:
2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అనేక రంగాల్లో పురోగతి సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, రైతు బంధు, బతుకమ్మ వేడుకల అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాలు ఈ రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా నిలిచాయి.
జూన్ 2 – రాష్ట్ర అవతరణ దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 2ను తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
తెలంగాణ ఏర్పాటయిన 12వ ఏట రాష్ట్రం నూతన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ఉద్యమం నుంచి ప్రభుత్వానికి, అంబేద్కర్ చుట్టూ మోడల్స్ నుంచి అభివృద్ధి ప్రణాళికల దిశగా తెలంగాణ సాగుతున్న పయనాన్ని గుర్తించాల్సిన రోజు ఇది..
Read More: Read Today’s E-paper News in Telugu