Telanganapatrika (July 13): Telangana 42% BC Reservation, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి తూచా తప్పకుండా ఎన్ని విడుదలకు ఎదురైనా అధిగమించుతూ అమలు చేస్తూ ఉంటే… గత పదేళ్లుగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించి హరీష్ రావు అబద్ధాలతో పాలన సాగించారని డిసిసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూన్నందుకు చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం , మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా నియామకమైన మండల అధ్యక్షుడు బత్తిని గణేష్ తో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం బీసీ వర్గాలకు రాజకీయంగా మేలుకోలిపే మార్గాన్ని తెరచుతుందని పేర్కొన్నారు.
Telangana 42% BC Reservation
- బీసీ రిజర్వేషన్లతో రాజకీయాలలో మారనున్న బీసీల దశ.
- సామాజిక న్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులకు బీసీలు రుణపడి ఉంటారు
- డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.
అమలు చేసింది రేవంత్ రెడ్డి… అబద్ధాలు చెప్పే హరీష్ రావు.!?
ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లలోను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయం దిశగా పాలన చేస్తు అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తూ సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ ప్రజానీకమంతా ఋణపడి ఉంటామన్నారు. గత ఎన్నికల సమయంలో, భారత్ జోడో యాత్రలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కులగన చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం కులగనన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో చేసినట్లు దేశ మొత్తం కులగన చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎరుగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి కల్లూరు నరసింహులు, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతగిరి చంద్రశేఖర్, మందపల్లి సంపత్, గుడి కందుల శేఖర్,ఫిషర్మెన్ కమిటీ గుండు వెంకట్, మండల పార్టీ కొరిమిరాజు, మండల నాయకులు జక్కుల నాగరాజు, బర్ల స్వామి, కొలను బాబు, మేకల దేవయ్య, పంజా రాజు, దేవరాయ శేఖర్, చిన్నకోడూరు గ్రామ కమిటీ అధ్యక్షులు గుడిమల్ల మల్లేశం, చౌడారం నవీన్, రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!
3 Comments on “Telangana 42% BC Reservation : చిన్నకోడూరులో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం.”