TDP Meeting Aswaraopeta, అశ్వరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కట్రం స్వామి దొర ఆదేశాల మేరకు అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో టీడీపీ కార్యకర్తల సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నర్సింగ్ సుధాకర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ అభివృద్ధి కోసం సైనికుల ఐకమత్యంగా అందరూ కలిసిమెలసి మండలంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగల రమేష్, రాయల నాగేశ్వరరావు, మాజీ వార్డ్ మెంబర్ అటిక నాగేశ్వరరావు, మాజీ వార్డ్ మెంబర్ మడి వెంకటేశ్వరరావు, వల్లెపు వెంకటేశ్వరరావు, బత్తుల శ్రీను, నూతక్కి శ్రీను, చెనబోయిన వెంకన్న, ఇనపనూరి సుందరం, మాజీ వార్డ్ మెంబర్ గుర్రం వెంకటేశ్వర్లు, తాటి రాంబాబు, రాచకొండ నాగరాజు, చనగోని వెంకన్న పాల్గొన్నారు.
Read more: Tractor Wheel Theft: తల్లాడ మండలంలో ట్రాక్టర్ దమ్ము చక్రాల చోరీల కలకలం!