
తెలంగాణపత్రిక, August 23 | suravaram sudhakar reddy ,సురవరం చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఐ నేతలు. కరీంనగర్ తెలంగాణ పత్రిదేశం గర్వించదగ్గ మహోన్నతమైన గొప్ప వ్యక్తి క ఆగష్టు 23:
భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు అందరికీ మార్గదర్శకులు, దేశం గర్వించదగ్గ మహోన్నతమైన గొప్ప వ్యక్తి సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కొనియాడారు. శుక్రవారం రాత్రి అనారోగ్య కారణాలవల్ల సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడంతో సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
suravaram sudhakar reddy tribute cpi
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశ రాజకీయాలలో విలువలతో కూడిన రాజకీయాలు చేసి, విద్యార్థి దశనుండే ఉద్యమాల వైపు నడిచి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో విద్యార్థి యువజన మిల్టెంట్ పోరాటాలు నిర్వహించిన మార్గదర్శకులు సుధాకర్ రెడ్డి అని, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, జిల్లాస్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, రెండు పర్యాయాలు నల్గొండ పార్లమెంటు సభ్యులుగా గెలుపొంది పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించారని, జాతీయస్థాయిలో అనేక సంస్కరణలు చట్టాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి రాజకీయ, సామాజిక,ఆర్థిక విషయాలన్నింటిపై సంపూర్ణ అవగాహన కలిగిన గొప్ప మేధావి అని,నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీ నేతగా జీవించి నేటితరం వారందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచిన సుధాకర్ రెడ్డి మరణం యావత్ భారత దేశ ప్రజానీకానికి కార్మిక వర్గానికి కమ్యూనిస్టు శ్రేణులకు తీరని లోటని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టులంతా కృషిచేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,బూడిద సదాశివ,ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్ల పెల్లి యుగేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మచ్చ రమేష్, తదితరులు పాల్గొ