Advertisement

SSC CGLE 2025 Notification: కేంద్రంలో 14,582 ఉద్యోగాలు

Telanganapatrika (June 5): SSC CGLE 2025 Notification, ప్రకటనతో దేశవ్యాప్తంగా యువతలో ఆశలు చిగురించాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో 14,582 ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపిక ప్రక్రియలో టైర్-1, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు, ఫిజికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు ఉంటాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
ssc cgle2025 notification jobs

SSC CGLE 2025 Notification:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూలై 7గా నిర్ణయించారు. ఎడిట్ ఆప్షన్ జూలై 9 నుండి 11 వరకు అందుబాటులో ఉంటుంది. వయోపరిమితి 2025 ఆగస్టు 1నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. సెప్టెంబర్ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టైర్-1 పరీక్ష ఆగస్టు 13 నుండి 30 వరకు, టైర్-2 పరీక్ష డిసెంబరులో నిర్వహించనున్నారు.

Advertisement

పోస్టులవారీగా వేతన శ్రేణి రూ.25,500 నుండి రూ.1,42,400 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. SSC CGLE 2025 Notification ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు లింక్: https://ssc.gov.in/

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →