TELANGANA PATRIKA (MAY 14) , police training కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పోలీస్(SP Ravula Giridhar) సిబ్బందితో కీలక సూచనలు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు విధులు నిర్వహణపై అవగాహన కల్పించారు.

SP Ravula Giridhar మాట్లాడుతూ..,
ఈ సందర్భంగా , విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ అధికారి సూచనలను గౌరవించాలని తెలిపారు. ముఖ్యంగా, పిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించడం ద్వారా చిన్న చిన్న సమస్యలకే పరిష్కారం లభిస్తుందన్నారు.
ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి, సంబంధిత అధికారికి సమాచారం అందించాలని సూచించారు. వారితో మర్యాదగా మాట్లాడి, వారి ఫోన్ నంబర్ తీసుకొని అవసరమైతే వెంటనే ఎస్సై వద్దకు పంపించాలని చెప్పారు.
పోలీస్టేషన్ల వద్దకు వచ్చే ఫిర్యాదుల ద్వారా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేయాలన్నారు. “మీ పోలీస్ – మన పోలీస్” అనే నినాదంతో ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు అడ్డుకోవాలన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు.
మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా DSPలు, సీఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments are closed.