Advertisement

SP Ashok Kumar : నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి..!

TELANGANAPATRIKA (June 13) : SP Ashok Kumar. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ IPS గారు సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచడం, నేరాల నివారణ, మరియు విజిబుల్ పోలీసింగ్ పై అధిక దృష్టి సారించాలనే సూచనలు ఇచ్చారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

SP Ashok Kumar విశేష సూచనలు:

  • గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, పాత నేరస్థులపై నిఘా ఉంచాలని అన్నారు.
  • ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
  • పోలీస్ సిబ్బంది సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు.

స్టేషన్ పరిశుభ్రత & 5S విధానం:

Advertisement

ఎస్పీ గారు 5S విధానం అమలు తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. ఫైలింగ్, డ్యూటీ రికార్డులు, రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర విభాగాల్లో సమగ్ర తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.

అమరవీరుని నివాళి:

1993లో మావోయిస్టుల మందుపాతర పేలుడులో అమరుడైన కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి ఎస్పీ అశోక్ కుమార్ గారు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

డీఎస్పీ రఘు చందర్, డిసిఆర్బి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, సారంగాపూర్ ఎస్ఐలు దత్తాద్రి, సదకర్, కుమారస్వామి, సుధీర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.