Advertisement

SP Akhil Mahajan : ఆదిలాబాద్ జిల్లాలో నేరాల సమీక్ష సమావేశం – వర్షాకాలంపై సిబ్బందికి హెచ్చరికలు..

TELANGANA PATRIKA(MAY28) ,SP Akhil Mahajan , ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నెలవారీ నేరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులు, ఇతర కీలక విభాగాల అధికారులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, వాహనాల్లో అత్యవసర సామాగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిలను దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

SP Akhil Mahajan నకిలీ విత్తనాలపై హెచ్చరికలు

రైతులు నకిలీ విత్తనాల వలలో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణాల వద్ద కొనుగోలు చేయాలని, లేబుల్లు, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి వివరాలు పరిశీలించి బిల్లు తీసుకోవాలని సూచించారు.

Advertisement

బక్రీద్, పశువుల రవాణా వ్యవహారం
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపించాలని, గంజాయి సాగు, గుడుంబా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

గ్రామాల పోలీస్ అవగాహన

డయల్ 100, బ్లూ కోర్ట్ సిబ్బంది గ్రామాల్లో “పోలీసు మీకోసం” కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో విపిఓ, ఎస్‌ఐ, సీఐ ఫోన్ నంబర్లు గోడలపై ప్రదర్శించాలని సూచించారు. ఎటువంటి సమాచారమైనా డయల్ 100 లేదా విపిఓకు తెలియజేయాలని సూచించారు.

SP Akhil Mahajan నేరాలపై సమీక్ష, కేసుల పురోగతి

గత నెలలో జరిగిన మోసాలు, నేరాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేయాలని, నాన్-బెయిలబుల్ వారంట్లను అమలు చేయాలని సూచించారు.

శిక్షణ తరగతులు, నైపుణ్య అభివృద్ధి

స్టేషన్ రైటింగ్, క్రైమ్ రైటింగ్ లలో సిబ్బందికి నైపుణ్యం పెంచేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలను మోసం చేసే రిజిస్ట్రేషన్ ముఠాలపై, అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, నాగేందర్, సీఐలు, ఎస్ఐలు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →