Golden Retriever: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగిగా ఒక కుక్క..!

Follow us

TELANGANA PATRIKA(MAY30) , Golden Retriever , హైదరాబాద్‌కు చెందిన Harvested Robotics అనే టెక్ స్టార్ట్‌ అప్ ఒక వినూత్న నిర్ణయంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ సంస్థ ఇటీవలే ‘డెన్వర్’ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను Chief Happiness Officer (CHO)గా నియమించింది. దీనికి సంబంధించిన ఓ అందమైన ఫోటోతో కూడిన లింక్‌డిన్ పోస్టు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ స్టార్ట్‌ అప్ సహ-స్థాపకుడు రాహుల్ అరేపాక తన లింక్‌డిన్ ఖాతాలో డెన్వర్‌ (Golden Retriever)ను పరిచయం చేస్తూ ఇలా రాశారు..,

“మా కొత్త నియామకుడు డెన్వర్‌ను కలవండి – Chief Happiness Officer. ఇతను కోడ్ చేయడు. పట్టించుకోడు కూడా. కానీ ప్రతి రోజూ ఆఫీస్‌కు వచ్చి అందరి మనసులు దోచుకుంటాడు. ఎనర్జీ లెవల్స్ పెంచేస్తాడు. ఇక నుంచి మా ఆఫీస్ అధికారికంగా పెట్‌ ఫ్రెండ్లీ. మా బృందంలో బెస్ట్ డిసిషన్ ఇదే.

ఈ హృద్యమైన పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో స్పందనలు హర్షాతిరేకంగా వచ్చాయి. ఎన్నో అభినందనలు, వినిపించాయి.

Advertisement

ఒక యూజర్ ఇలా వ్యాఖ్యానించారు:

“ఇంత క్రీయేటివిటీ, జంతువుల పట్ల ప్రేమ కలగలిపిన ఆలోచన చూసి ఆశ్చర్యపోయా. మీరు చేసిన పనికి గొప్ప అభినందనలు, సెల్యూట్ సార్!”

ఇంకో యూజర్ డెన్వర్‌ను “The cutest officer” అని వర్ణించారు.

డెన్వర్ ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత, Harvested Robotics సంస్థ ‘సానుభూతి మరియు సృజనాత్మకత’తో కూడిన కార్పొరేట్ సంస్కృతికి ఒక ‘గోల్డెన్’ ప్రామాణికతను స్థాపించినట్లే అయ్యింది.

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →