Telanganapatrika (July 18): Social Media FIR , ఇరు వర్గాల మధ్య, గ్రూపుల మధ్య రెచ్చగొట్టేలా శాంతిభద్రతల సమస్యలను తీసుకువచ్చేలా సోషల్ మీడియా నందు వాట్సాప్ ల నందు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర రావు తెలియజేశారు. అసత్యాలు ప్రచారం చేసేలా ఉండే సోషల్ మీడియాపై వాట్సాప్ గ్రూపులపై జిల్లా పోలీసుల దృష్టి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తలు పాటించాలి. విద్వేషాలు రెచ్చగొట్టి వాట్సప్ నందు ఇతరులకు పంపే వారిపై, మరియు వాట్సప్ గ్రూపు అడ్మిన్ లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు.

Social Media FIR సోషల్ మీడియా బాధ్యతగా వాడకపోతే చట్టపరమైన చర్య తప్పదు..!
ఆదిలాబాద్ పట్టణంలోని నిందితుడు పద్మావార్ రాకేష్ పట్టణంలో శాంతిభద్రతల సమస్యలను తీసుకువచ్చేలా ఇది వర్గాల విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్యాన్ని ప్రచారం చేస్తూ పోస్టులను పెట్టిన నేపథ్యంలో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు.
నిందితుని ఫోన్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయగా అతని మొబైల్ ఫోన్లో ఇరు వర్గాల మధ్య రెచ్చగొట్టేలా పోస్టులు లభ్యమైనట్లు తెలిపారు. ప్రజల అశాంతికి, భద్రతకు భంగం కలిగించేలా శాంతిభద్రతల సమస్యలు తీసుకువచ్చేలా ఉన్న వారి పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియా నందు అసత్యాల ప్రచారం, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులను తయారు చేసి వాటిని సోషల్ మీడియా నందు వాట్సాప్ గ్రూపుల నందు పోస్ట్ చేసిన వారిపై మరియు వాట్సాప్ గ్రూపు యజమానులపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. గ్రూపుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ఎల్లవేళలా గమనిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లను నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read More: Read Today’s E-paper News in Telugu