Sircilla Wines Tender: సిరిసిల్ల జిల్లాలో మద్యం టెండర్ల డ్రాలో ఈసారి పెద్ద చర్చనీయాంశంగా మారింది సిండికేట్ ఓటమి. జిల్లాకు చెందిన 18 మంది వ్యాపారులు కలిసి సిండికేట్‌గా ఏర్పడి మొత్తం 121 మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేశారు. అయితే, ఈ భారీ ప్రయత్నం విఫలమై ఒక్క లైసెన్స్ కూడా దక్కలేదనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Sircilla Wines Tender 121 దుకాణాలకు టెండర్లు వేసిన సిండికేట్ ఫలితం జీరో.
సాధారణంగా సిండికేట్లు పెద్ద మొత్తంలో టెండర్లు వేసి లైసెన్సులు పొందుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు ఈ ఓటమికి సాంకేతిక కారణాలు, మరికొందరు అదృష్టం లేకపోవడమే కారణమని భావిస్తున్నారు.
జిల్లాలో మద్యం టెండర్ల డ్రా పూర్తయిన తర్వాత వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. “సిండికేట్‌గా పోటీ చేసి కూడా ఒక్క దుకాణం రాకపోవడం మొదటిసారి జరుగుతోంది” అని స్థానిక వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఈ పరిణామంపై మద్యం శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అధికారులు ఈ ఫలితాలపై సమీక్ష జరిపే అవకాశం ఉందని సమాచారం
Read More: Read Today’s E-paper News in Telugu
