Advertisement

Siddipet Prajavani: సత్వర పరిష్కారానికి ప్రజావాణి – కలెక్టర్ మను చౌదరి

siddipet prajavani

తెలంగాణ పత్రిక (APR.08): Siddipet Prajavani : సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి – జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి , ప్రజా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగ్రవాల్, అబ్ధుల్ హమీద్ లతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల మరియు ఇతర అర్జిలు మొత్తం 54 వచ్చాయి. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Read more: Read Today’s Latest E-paper News in Telugu

Advertisement

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →