Telanganapatrika (July 14): Siddipet Collectorate , సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు లేనందున విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్, డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్లకు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్ఐ తన బాధ్యతలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, “నాకు టైం లేదు”, “రేపు రా” అనే తీరుతో విద్యార్థులను అవమానపరిచే స్థాయిలో తిరస్కరిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Siddipet Collectorate ఎవరి చుట్టూ తిరుగుతారో తెలియని పరిస్థితిలో విద్యార్థులు!
రోజూ రెవెన్యూ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భవిష్యత్ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని,
సర్టిఫికెట్ల జారీ పనిలో అలసత్వం వల్ల విద్యార్థుల సంవత్సరమే వృథా కావచ్చని, తక్షణమే పెండింగ్ ఉన్న సర్టిఫికెట్లు జారీ చేసి, వారి భవిష్యత్‌కు అండగా నిలవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా ఎన్ని రోజులు తిరగాలి?
“ఏవరమైతే చదువు కోసం పోరాడుతున్నామో… అదే చదువు తలకిందులవుతోంది! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై విద్యార్థులకు న్యాయం చేయాలని, కాలయాపన చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu