Shatrajpally farm visit : శాత్రాజుపల్లిలో పంటల పరిశీలన రైతులకు నూతన సలహాలు..!

Telanganapatrika (July 19): Shatrajpally farm visit , వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామంలో పత్తి, వరి పంటల పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పంటల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను రైతులకు సూచించారు.

Shatrajpally farm visit ఫీల్డ్‌లోకి వ్యవసాయ అధికారులు..

వరి నారు మడిలో ఇనుపదాతు లోపం, కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించామని అధికారులు తెలిపారు. ఇనుప లోపం నివారణకు: అన్నబేధి 1 గ్రాము/ఎకరం చొప్పున వేయాలని సూచించారు.కాండం తొలుచు పురుగుల నివారణకు: క్లోరాంత్రానిలిప్రోల్ గుళికలు 4 కిలోలు/ఎకరం మోతాదులో వినియోగించాలని సిఫారసు చేశారు. అలాగే పత్తి పంటల్లో రసం పీల్చు పురుగులు ఆశించినట్లు గుర్తించారు. ఇవినివారించేందుకు ఎసిఫేట్, 1.5 గ్రాములు/లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయమని రైతులకు సూచించారు.

Advertisement

Advertisement

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *