Telanganapatrika (July 19): Shatrajpally farm visit , వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామంలో పత్తి, వరి పంటల పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా పంటల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను రైతులకు సూచించారు.

Shatrajpally farm visit ఫీల్డ్‌లోకి వ్యవసాయ అధికారులు..
వరి నారు మడిలో ఇనుపదాతు లోపం, కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించామని అధికారులు తెలిపారు. ఇనుప లోపం నివారణకు: అన్నబేధి 1 గ్రాము/ఎకరం చొప్పున వేయాలని సూచించారు.కాండం తొలుచు పురుగుల నివారణకు: క్లోరాంత్రానిలిప్రోల్ గుళికలు 4 కిలోలు/ఎకరం మోతాదులో వినియోగించాలని సిఫారసు చేశారు. అలాగే పత్తి పంటల్లో రసం పీల్చు పురుగులు ఆశించినట్లు గుర్తించారు. ఇవినివారించేందుకు ఎసిఫేట్, 1.5 గ్రాములు/లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయమని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu