నిజామాబాద్ లో సెక్షన్ 163 అమలు

TELANGANA PATRIKA (MAY24) , గ్రామ పాలన ఆఫీసర్ పరీక్ష నిర్వహణ కోసం నిజామాబాద్ డివిజన్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ లో పరీక్ష కోసం తేది : 25-05-2025 నాడు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలో వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలులో ఉంటుంది అని తెలియజెసారు.

Advertisement

Advertisement

అండర్ సెక్షన్ 163 అమలు

ప్రకారం.

Advertisement
  • ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు.
  • నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు.
  • అన్ని పరీక్షా కేంద్రo పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌ లను 25-05-2025 (ఉదయం 07.00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు) మూసివేసి ఉంచాలి.పై నిషేధిత ఉత్తర్వులు 25-05-2025 (ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు) అమలులో ఉంటాయని తెలిపారు.

Also Read : నిజామాబాద్: గ్రామ పంచాయతీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – అదనపు కలెక్టర్

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →