Telanganapatrika (July 15) : Seasonal Diseases Alert. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచరాదు. మున్సిపల్ పరిధిలో పరిశుభ్రతను పరిశీలించిన కమిషనర్ మల్లికార్జున్.

Seasonal Diseases Alert.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు ఇంటి పరిసర ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో వందరోజుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు.16 వ వార్డులోని పబ్లిక్ టాయిలెట్ ను పర్యవేక్షించడం జరిగిందని,అనంతరం 5 వ వార్డు లో సిపిఐ కార్యాలయం ముందు నిల్వ ఉన్న నీటిని మోటార్ సహాయంతో తొలగించడం జరిగిందని అన్నారు.7 వ వార్డులోని డిపో వెనకాల ఉన్న పార్క్ ను క్లీనింగ్ చెయ్యడం జరిగిందని,పార్క్ క్లీనింగ్ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, కమిషనర్ అనబేరి చౌరస్తా వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఇంచార్జ్ ఆర్ ఐ ప్రసాద్ ,పర్యావరణ అధికారి రవికుమార్ గారు,వార్డ్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.