SC/ST Atrocities Act : కులం పేరుతో దూషణ – నిందితుడికి జైలు శిక్ష & రూ.2000 జరిమానా

Follow us

Telanganapatrika (July 14): SC/ST Atrocities Act , జైనథ్ మండలానికి చెందిన గూడ గ్రామస్థుడు బాధితుడు మడవి రాజు మరియు తన భార్యతో కలిసి తేదీ 31.01.2022 రోజున ఉదయం తన బంధువుల ఇంటికి పిట్టగూడా గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో గూడ గ్రామానికి వస్తుండగా అదే గ్రామస్తుడు నిందితుడు బండారి దేవన్న (62) s/o రాములు అనే వ్యక్తి దారికి అడ్డుగా వచ్చి మద్యం తాగడానికి డబ్బులు అడగగా, నా దగ్గర లేవు రేపు ఇస్తాను అని తిరిగి వెళుతుండగా, గోండోడ (కులాన్ని చెబుతూ అవమానించి) డబ్బులు ఇవ్వు అని తిట్టినాడు. ఇంకా గొడ్డలి పట్టుకొని వచ్చి తనను వెనక నుండి కొట్టగా తన కుడి కన్ను కనత భాగంలో దెబ్బ తగిలి గాయం కాగా వెంటనే మడావి రాజు 108 అంబులెన్స్ లో రిమ్స్కు తరలించి చికిత్సను అందించినారు.

SC/ST Atrocities Act నేరస్తులకు మార్పు రావాలి – న్యాయమూర్తి కుమార్ వివేక్ వ్యాఖ్య..

మడావిరాజు దరఖాస్తు మేరకు అప్పటి జైనథ్ ఎస్సై బిట్ల పెర్సస్ కేసు నమోదు చేయగా డిఎస్పి వి ఉమేందర్ దర్యాప్తు చేసి సెక్షన్ 294 బి 324 ఐపిసి 3 (1)(r)(s) 43 (2)(va) 7 ఎస్సీ ఎస్టీ ఆక్ట్ నందు కేసు నమోదు చేయగా చార్జిషీటు దాఖలు చేయగా.

Advertisement

ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి 12 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా ప్రత్యేక న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టు కుమార్ వివేక్ తీర్పును వెలువరిస్తూ బండారి దేవన్న కు పైన సెక్షన్ 324 ఐపిసి కింద ఆరు నెలల పాటు సాధారణ జైలు,రూ 500/- జరిమానా, 3(1)(2) ప్రకారం ఆరు నెలలు మరియు 2000 రూపాయల జరిమానా, 3 (1)(s) ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష రూపాయలు 500 జరిమానా, మొత్తం అన్ని సెక్షన్లకి కలిపి ఆరు నెలల జైలు శిక్ష రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఇట్టి కేసు నందు కోర్టు డ్యూటీ అధికారి ఎంఏ జమీర్, జైనథ్ సిఐ డి సాయినాథ్, కోర్టు లైసెన్ధికారి పండరి సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →