Saraswati Pushkaralu 2026: తెలంగాణలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సరస్వతి అంత్య పుష్కరాలు మే 21 నుంచి కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కర మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రూ.30.63 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసింది.
Saraswati Pushkaralu 2026 తొలి పుష్కర స్నానం ఎప్పుడు?
మే 21 ఉదయం 5:43 గంటలకు కాంచీ పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మరియు తెలంగాణ గవర్నర్ Shiv Pratap Shukla తొలి పుష్కర స్నానం చేయనున్నారు.

Saraswati Pushkaralu 2026 భారీగా భక్తుల రాక
పుష్కరాల సందర్భంగా 30 నుంచి 40 లక్షల మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక షెల్టర్లు, తాటి చాపలు, ORS ప్యాకెట్లు ఏర్పాటు చేశారు.
భద్రత కోసం ప్రత్యేక చర్యలు
- 100 మంది నిపుణులైన ఈతగాళ్లను నియమించారు
- SDRF బృందాలు, బోట్లు, లైఫ్ రింగ్స్ సిద్ధం చేశారు
- 200 CCTV కెమెరాలతో పర్యవేక్షణ
- 90 షటిల్ బస్సులు భక్తుల రవాణాకు సిద్ధం
- వైద్య, పారిశుధ్య ఏర్పాట్లు
23 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి 300 మంది వైద్య సిబ్బందిని నియమించారు. అంబులెన్సులు అన్ని కీలక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. 500 పోర్టబుల్ టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణలు
ప్రతి రోజు ఉదయం హోమాలు నిర్వహించనుండగా, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. నాగేంద్ర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు.
భక్తుల కోసం నిరంతర విద్యుత్ సరఫరా, పార్కింగ్ సదుపాయాలు, మీడియా సెంటర్ వంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
