ఇసుక మాఫియా: కదలికలపై కన్నేసిన అధికారులు – పలుచోట్ల ట్రాక్టర్లు పట్టివేత

TELANGANA PATRIKA (MAY 19) , సిద్దిపేట జిల్లా మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమంగాఇసుక మాఫియా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం రాజగోపాలపేట పోలీసు పట్టుకున్నారు.

ఇసుక మాఫియా కదలికలపై అధికారుల నిఘా తీవ్రం

రాజగోపాలపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎం.డి. ఆసిఫ్, ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ బి.సౌజన్య కథనం ప్రకారం.. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల ఎల్లయ్య, చామంతుల బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు రెండు ట్రాక్టర్లలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు గాని, ఎలాంటి వే బిల్స్ గాని లేకుండా బస్వాపూర్ శివారులో మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.

Advertisement

వాగు నుండి సిద్ధన్నపేట వైపు తరలిస్తుండగా సిద్దన్నపేట బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజగోపాలపేట పోలీసులు పట్టుకున్నారు. అనుమతులకు సంబంధించి కాగితాల కోసం తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. తదుపరి చర్య నిమిత్తం నంగునూరు తహశీల్దారుకు సమాచారం అందించినట్లు ఎస్సై ఏం.డి. అసిఫ్, ప్రొబేషనరీ ఎస్ఐ బి. సౌజన్య వివరించారు.

Advertisement
Advertisement

Also Read : ఇందిరా సౌర గిరి జల వికాసం: కొత్త పథకం ప్రారంభానికి సిద్ధమైన సీఎం రేవంత్

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.