
TELANGANA PATRIKA (MAY 19) , సిద్దిపేట జిల్లా మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమంగాఇసుక మాఫియా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం రాజగోపాలపేట పోలీసు పట్టుకున్నారు.
ఇసుక మాఫియా కదలికలపై అధికారుల నిఘా తీవ్రం
రాజగోపాలపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎం.డి. ఆసిఫ్, ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ బి.సౌజన్య కథనం ప్రకారం.. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల ఎల్లయ్య, చామంతుల బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు రెండు ట్రాక్టర్లలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు గాని, ఎలాంటి వే బిల్స్ గాని లేకుండా బస్వాపూర్ శివారులో మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
వాగు నుండి సిద్ధన్నపేట వైపు తరలిస్తుండగా సిద్దన్నపేట బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజగోపాలపేట పోలీసులు పట్టుకున్నారు. అనుమతులకు సంబంధించి కాగితాల కోసం తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. తదుపరి చర్య నిమిత్తం నంగునూరు తహశీల్దారుకు సమాచారం అందించినట్లు ఎస్సై ఏం.డి. అసిఫ్, ప్రొబేషనరీ ఎస్ఐ బి. సౌజన్య వివరించారు.
Also Read : ఇందిరా సౌర గిరి జల వికాసం: కొత్త పథకం ప్రారంభానికి సిద్ధమైన సీఎం రేవంత్
Comments are closed.