TELANGANAPATRIKA (June 21): Sadashivpet KGBV Inspection. సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ రోడ్ లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు.

Sadashivpet KGBV Inspection వంటగది, ఆహార నాణ్యతపై పరిశీలన
కలెక్టర్ పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, భోజనశాలలను పర్యవేక్షించారు. విద్యార్థులకు అందుతున్న ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం పై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందించే ఆహారం నూతన మెనూ ప్రకారం నాణ్యంగా ఉండాలని, పాఠశాల సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు.

యూనిఫామ్ పంపిణీ ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం
విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ లో ఆలస్యం జరిగిన విషయాన్ని గుర్తించిన కలెక్టర్, ఎంఈఓ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శనివారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా,
ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఊర్మిళ , స్పెషల్ ఆఫీసర్ లలిత
ల వారికి షోకేస్ నోటీసులు అందజేశారు.
అధికారుల హాజరు
ఈ తనిఖీలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం, భోజన నాణ్యత, మరియు భద్రత అంశాల్లో నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Sadashivpet KGBV Inspection : యూనిఫామ్ జాప్యం పై కలెక్టర్ ఆగ్రహం..!”