Rural Employment: హిమ్మత్ నగర్ గ్రామంలో 24 రోజుల నిరాహార దీక్ష

Follow us

Telanganapatrika (August 03) : Rural Employment – హిమ్మత్ నగర్ గ్రామస్థులు ఇసుక క్వారీలలో ఉపాధి కోసం దీక్షలు చేపట్టారు. ఆర్డీవో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Rural Employment - RDO visits Himmatnagar protest site for employment demand
హిమ్మత్ నగర్ ఉపాధి దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆర్డీవో రమేష్ బాబు

హిమ్మత్ నగర్ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆర్డీవో రమేష్ బాబు..

హిమ్మత్ నగర్ గ్రామంలో ఇసుక క్వారీలలో ఉపాధి నిమిత్తం గ్రామస్తులు చేపట్టిన, సామూహిక రిలే నిరాహార దీక్షలు 24 రోజులకు చేరుకున్నాయి. శనివారం జిల్లా కలెక్టర్ సూచన మేరకు దీక్ష శిబిరాన్ని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, మండల తహసిల్దార్ రజిత సందర్శించి, నిరాహార దీక్ష చేపట్టిన గ్రామస్తులతో చర్చించారు. హిమ్మత్ నగర్ గ్రామస్తులు డిమాండ్లను కులంకషంగా ఆర్డీవోకు వివరించారు. హిమ్మత్ నగర్ గ్రామం కొండపాక రెవెన్యూ గ్రామ పరిధిలో ఉందని, ఇసుక క్వారీలలో లారీలకు పరదాలు కప్పేందుకు, మా గ్రామస్తులకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదాయాన్ని మా గ్రామానికి కూడా ఇవ్వాలని, ఇసుక క్వారీలలో మా గ్రామానికి వాటా కల్పించాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఆర్డీవో గ్రామస్తుల డిమాండ్లను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, సమస్య పరిష్కార దిశగా మా వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.

Advertisement

Read More: Rapido Driver Arrested : వీడియో పెట్టి సమాజాన్ని చీల్చాలనుకున్నాడు…రాపిడో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Gnaneshwar kokkula

"I’m Kokkula Gnaneshwar, a digital content creator at Telangana Patrika. I specialize in crafting well-researched and engaging content focused on Telugu news, regional culture, and space updates. My goal is to deliver accurate, meaningful, and easy-to-understand information that helps our readers stay informed and connected to what matters most."

View all posts by Gnaneshwar kokkula →