Advertisement

RTC Free Bus Scheme Telangana 2025: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు – మహిళల ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు

Telanganapatrika (July 24): RTC Free Bus Scheme Telangana 2025, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం పలు విప్లవాత్మక మార్పులకు దారి తీసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పథకం వల్ల బాలికలపై ఆర్థిక భారం తగ్గిందని, ఇది ఆరోగ్య పరిరక్షణకు కూడా ఒక కీలక ఆధారంగా మారిందని వ్యాఖ్యానించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
CM Revanth Reddy praises RTC free bus scheme in Telangana for empowering women
RTC Free Bus Scheme Telangana 2025

ఒక్క పథకం వల్ల రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC) అప్పుల నుండి బయటపడినదని సీఎం వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల ఫ్రీ టికెట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఘనతకు కార్పొరేషన్ సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు మరియు మేనేజ్మెంట్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా ముఖ్యమంత్రి అభినందించారు.

Advertisement

ఈ పథకం అమలుతో పాటు, మహిళల RTC ప్రయాణం అంచనాలకు మించిన స్థాయిలో పెరిగిందని సీఎం పేర్కొన్నారు. ముందుగా 35 శాతం ఉన్న మహిళల ప్రయాణ శాతం, ఇప్పుడు 60 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. “పేదల అభివృద్ధికి రథం రూపంలో ఉన్న RTC ఒకప్పుడు చరిత్ర పుటల్లో మాయం కావాల్సిన పరిస్థితిలో ఉండేది. కానీ ఈ పథకం ఆ రథానికి తిరిగి చక్రాలు తొడిగింది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పథకం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరిందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని సీఎం తెలిపారు.

Read More: NEET Local Quota Telangana 2025: లోకల్ కోటాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “RTC Free Bus Scheme Telangana 2025: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు – మహిళల ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *