TELANGANA PATRIKA(MAY 7) , Rohit Sharma Test Retirement: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. దేశం తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించటం గర్వంగా భావిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Rohit Sharma Test Retirement అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు
ఇన్నేళ్లు తనపై చూపిన ప్రేమ, మద్దతుకు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రతి టెస్టు మ్యాచ్‌లో ఆడడం ఒక గౌరవం. ఇప్పుడు నా పాత్ర పూర్తయ్యిందని భావిస్తున్నా. అందుకే టెస్టులకు వీడ్కోలు చెబుతున్నాను’’ అని రోహిత్ పేర్కొన్నారు.
వన్డేల్లో కొనసాగిస్తాను
రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే వన్డేల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. టెస్టుల్లో 67 మ్యాచుల్లో ఆయన 4,301 పరుగులు చేశారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.
Also Read : GT VS MI: వరుస విజయాలకు….చెక్
Comments are closed.