సుల్తానాబాద్ రైస్ మిల్ బాయిలర్ పేలుడు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనకదుర్గా రైస్ మిల్‌లో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో గాయపడిన గంగారపు కుమార్ (44) ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అక్టోబర్ 29న ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు కుమార్‌తో పాటు మరో కార్మికుడు కుమారస్వామి తీవ్ర గాయాలపాలయ్యారు.
వీరిని వెంటనే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న గంగారపు కుమార్ ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ ఘటనపై స్థానిక కార్మిక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మరణించిన కార్మికుడి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని, మిల్ యాజమాన్యాన్ని కోరాయి.
సమాజంలో సాధారణంగా కనిపించే నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ఆగలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటన సుల్తానాబాద్ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. స్థానిక ప్రజలు, మిత్రులు, సహచరులు గంగారపు కుమార్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “సుల్తానాబాద్ రైస్ మిల్ బాయిలర్ పేలుడు బాధితుడు గంగారపు కుమార్ మృ*తి..”
Comments are closed.